శివాలయంలో ప్రత్యేక పూజలు

KMM: నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భ్రమరాంబ సమేత మల్లికార్జున ఆలయంలో ఇవాళ ఉదయం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. ముందుగా స్వామివారికి అభిషేకార్చన, అష్టోత్తర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం హారతి సేవ కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.