ఈనెల 12న తెనాలి రానున్న సినీ నటి మీనాక్షి చౌదరి
GNTR: ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి ఈ నెల 12వ తేదీన తెనాలి పట్టణానికి రానున్నారు. తెనాలిలో నూతనంగా ఏర్పాటు చేసిన 'సౌత్ ఇండియా షాపింగ్ మాల్' ప్రారంభోత్సవం ఆమె చేతుల మీదుగా జరగనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెనాలి మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ హాజరు కావాలని 'సౌత్ ఇండియా షాపింగ్ మాల్' యాజమాన్యం కోరారు.