ఇండిగో ఉద్యోగులకు సీఈవో కృతజ్ఞతలు
ఇండిగో సంస్థ సీఈవో ఎల్బర్స్, తమ ఉద్యోగులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంక్షోభ సమయంలో తమ ఉద్యోగులందరూ చాలా బాగా పనిచేశారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా, సంస్థ దశలవారీగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఇండిగో యొక్క ఓటీపీ వ్యవస్థ కూడా మెరుగుపడిందని స్పష్టం చేశారు.