VIDEO: 'రిపేరు చేయండి... ప్రాణాలు కాపాడండి'
NLG: 'గుంతలు పూడ్చండి ప్రజల ప్రాణాలు కాపాడండి' అంటూ... హైదరాబాద్-నల్గొండ రోడ్డులో మర్రిగూడ జంక్షన్ వద్ద సీపీఎం నేతలు గురువారం ఆందోళన చేపట్టారు. నల్గొండ పట్టణంలో గుంతల మయంగా మారిన రోడ్లతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హాషం, దండెంపల్లి సత్తయ్య, ఎండీ సలీం, మల్లం మహేష్ డిమాండ్ చేశారు