జాతీయ పతాకాన్ని ఎగుర వేసిన ఎమ్మెల్యే

NDL: ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి జాతీయ జెండాను ఎగుర వేశారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా మనం స్వాతంత్య్ర ఫలాలను అనుభవిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆసం రఘురాం రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.