నిబంధనలు ఉల్లంఘించిన బిల్డర్‌కు భారీ ఫైన్
MDCL: నిబంధనలు ఉల్లంఘించిన బిల్డర్‌పై TGRERA భారీ జరిమానా విధించింది. MDCL జిల్లా కొంపల్లిలో 'భారతి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్' చేపట్టిన భారతి లేక్ వ్యూ అపార్ట్‌మెంట్స్ ప్రాజెక్టులో ప్రీ-లాంచ్ స్కీమ్ చేపట్టింది. ఈమేరకు కొనుగోలుదారుల నుంచి నిధులు సేకరించినట్లు గుర్తించిన రేరా రూ. 4.74 కోట్ల ఫైన్ వేసింది. దీంతో 24 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు.