VIDEO: అప్పికట్లలో “అన్నదాత సుఖీభవ” కార్యక్రమం
కృష్ణా: పెదపారుపూడి మండలం అప్పికట్ల గ్రామంలో “అన్నదాత సుఖీభవ” కార్యక్రమం సోమవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొని రైతులతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అనంతరం టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు.