డ్రైవర్ నిర్లక్ష్యంతో మహిళ మృతి

NRPT: RTC బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ మహిళ మృతి చెందిన ఘటన గుండుమాల్ మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గుండుమాల్‌కు చెందిన వేపూర్ దస్తమ్మ (40) బస్సు దిగుతున్న సమయంలో డ్రైవర్ గమనించకుండా బస్సును పోనివ్వడంతో బస్సు టైర్ కింద పడి తీవ్రంగా గాయపడింది. వెంటనే అంబులెన్స్ ద్వారా కోస్గి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.