VIDEO: 'కార్మికుల వేతనాలు పెంచాలి'
SRCL: ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ అన్నారు. తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో గ్రామపంచాయతీ కార్మికులతో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.