మహిషాసుర మర్దిని దేవిగా అమ్మవారి దర్శనం

మహిషాసుర మర్దిని దేవిగా అమ్మవారి దర్శనం

GNTR: దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా పొన్నూరులోని తెలగపాలెం శ్రీ కోదండ రామాలయంలో 10వ రోజు బుధవారం అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దనీ దేవి (మహర్నవమి)గా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు చిలకపాటి లక్ష్మణ్ రామాచార్యులు (రాము) ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.