VIDEO: సత్యసాయి శత జయంతికి పుట్టపర్తిలో నూతన రోడ్లు
సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తి పట్టణంలో కొత్త తారు రోడ్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. లక్షలాది మంది భక్తులు పుట్టపర్తికి రానున్న నేపథ్యంలో రాకపోకల సౌకర్యార్థం, పట్టణ సుందరీకరణలో భాగంగా ఈ పనులను అధికారులు వేగవంతం చేశారు. ప్రధాన రహదారులను, భక్తులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లోని రోడ్లను నూతనంగా నిర్మిస్తున్నారు.