బాదంపల్లిలో రైతు ఆత్మహత్యాయత్నం
MNCL: అటవీ అధికారులు వేధిస్తున్నారని జన్నారం మండలంలోని బాదంపల్లికి చెందిన శేఖర్ అనే రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మంగళవారం ఆయన గ్రామంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. తన పొలం అడవికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సెన్సిటివ్ ఏరియా పేరుతో అటవీ అధికారులు తన జెసీబీని సీజ్ చేయడానికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.