బీసీలంతా ఏకం కావాలి: తీన్మార్ మల్లన్న
MBNR: బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం సాధించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. శుక్రవారం రాజాపూర్ మండల కేంద్రంలో బీసీ సంఘాల ఐక్యవేదిక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా పార్లమెంట్‌లో ఆమోదింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.