రాజరాజేశ్వరి అమ్మవారి హుండీ లెక్కింపు

నెల్లూరు: నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. హుండీ ద్వారా రూ.16,39,705, అన్నదానం రూ.37,418 నగదు వచ్చినట్లు తెలిపారు. ఈ మొత్తం 62 రోజుల కాలానికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి జే శ్రీనివాస్, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయిస్, సిబ్బంది పాల్గొన్నారు.