BREAKING: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
జీ-7 దేశాధినేతల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడులకు ఇరాన్ భయపడిందని, ప్రస్తుతం ఆ దేశం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇరాన్ సైనిక సామర్థ్యం దెబ్బతినడంతో ఆ దేశ నేతలు వెనక్కి తగ్గుతున్నారని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశం కనిపిస్తోంది.