రేపు రాష్ట్రానికి యూకే బృందం
TG: బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధి బృందం రేపు రాష్ట్రంలో పర్యటించనుంది. హైదరాబాద్‌లో సుమారు 13 నూతన పాఠశాలలను ఏర్పాటు చేయాలనే కీలక ప్రతిపాదనతో ఈ బృందం వస్తోంది. ఈ పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రతినిధులు రాష్ట్ర ఉన్నతాధికారులతో భేటీ అయి, పాఠశాలల స్థాపన, విద్యా ప్రమాణాలు, ఇతర మౌలిక వసతులపై చర్చించనున్నారు.