విగ్రహావిష్కరణకు మంత్రికు ఆహ్వానం
VZM: తాటిపూడి ప్రాజెక్టు నిర్మాత, స్వాతంత్ర సమరయోధులు దివంగత గొర్రిపాటి బుచ్చి అప్పారావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆదివారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈమేరకు ప్రాజెక్టు ఛైర్మన్ కల్లంపూడి జగన్నాథం, గంట్యాడ మండల పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర నాయుడులు నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిశారు.