అర్ధరాత్రి వరకు నామినేషన్ల స్వీకరణ

అర్ధరాత్రి వరకు నామినేషన్ల స్వీకరణ

గద్వాల జిల్లాలోని ధరూర్, కేటీదొడ్డి, గద్వాల, గట్టు మండలాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ రాత్రి 11 దాటినా కొనసాగింది. సాయంత్రం 5 గంటలకు గడువు ముగిసినప్పటికీ, అప్పటికి క్యూలో ఉన్న అభ్యర్థులకు టోకెన్లు జారీ చేయడంతో, రాత్రి 11 గంటల వరకు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ నామపత్రాలను అధికారులకు సమర్పించారు.