ఇందిరా పార్కుకు తరలిన గద్వాల శ్రేణులు

ఇందిరా పార్కుకు తరలిన గద్వాల శ్రేణులు

GDWL: హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద శనివారం నిర్వహించిన యువజన కాంగ్రెస్ సమావేశానికి జిల్లా నుంచి కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు తిరుమలేశ్ మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి వాహనాల్లో శ్రేణులు తరలివచ్చినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో గద్వాల జిల్లావ్యాప్తంగా యూత్ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.