రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు జిల్లా విద్యార్థి ఎంపిక

విజయనగరం: కొత్తవలస మండలంలో ఉన్న సెయింట్ ఆన్స్ పాఠశాలకి చెందిన మేడిశెట్టీ రాజేష్ అండర్- 17 విభాగంలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక అయ్యారు. రాజేష్‌ను పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ కెథరిన్, పాఠశాల ప్రిన్సిపల్ సుధారాణి అభినందించారు. హిందూపురంలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో కూడా ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.