మహిళలకు విజయ్ వరాల జల్లు

మహిళలకు విజయ్ వరాల జల్లు

తమిళనాడు ఎన్నికల వేళ పలు హామీలను టీవీకే చీఫ్ విజయ్ ప్రకటించారు. అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల చిన్నారులకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం, పేదలకు ఏటా ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు, మహిళల రక్షణకు ప్రత్యేక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మహిళలకు రూ.2500, రేషన్ షాపుల్లో శానిటరీ ప్యాడ్స్ ఇస్తామని చెప్పారు.