భైరవకోనను పరిశీలించిన డీఎస్పీ

భైరవకోనను పరిశీలించిన డీఎస్పీ

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోన క్షేత్రాన్ని డీఎస్పీ సాయి ఈశ్వర యశ్వంత్ బుధవారం పరిశీలించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో భైరవకోనకు తరలి రావడంతో పామూరు పోలీసులతో బందోబస్తు చర్యలు చేపట్టారు. కాగా, జలపాతం వద్ద ప్రమాదాలు జరగకుండా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి, ట్రాఫిక్ సమస్యల తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.