ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత కల్పించాలి: మంత్రి

ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత కల్పించాలి: మంత్రి

అన్నమయ్య: బస్సులో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత కల్పించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. రాయచోటిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్లానర్స్ అండ్ ఇంజినీర్స్ సీఈవోతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో బస్సుల భద్రత, నాణ్యతను పరిశీలించాలని మంత్రి కోరారు. బస్సుల యజమానులు భద్రత ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.