PGRS కార్యక్రమానికి 78 పిటీషన్లు

ATP: అనంతపురంలో నిర్వహించిన PGRS కార్యక్రమానికి 78 పిటీషన్లు వచ్చాయని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. జిల్లా నలమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి ఎస్పీ సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి అర్జీలను స్వీకరించారు. నడవలేని స్థితిలో ఉన్న వారి వద్దకు ఎస్పీ స్వయంగా వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు.