కరటూరి కృష్ణ చిత్రపటానికి MLA నివాళి
EG: దేవరపల్లి మండలం దుద్దుకూరులో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన టీడీపీ నాయకుడు కరుటూరి కృష్ణ నివాసానికి వెళ్లి, గ్రామ టీడీపీ అధ్యక్షుడు కొయ్యలమూడి తాతారావుతో కలిసి చిత్రపటానికి నివాళులు అర్పించారు. మంచితనం, నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయామని ఎమ్మెల్యే తెలిపారు.