నగరంలో ఒకేసారి రెండు అగ్ని ప్రమాదాలు
HYD: జీడిమెట్లలో ఇవాళ ఉదయం ఒకేసారి రెండు అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గంపలబస్తీలోని స్క్రాప్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. అలాగే ఉదయగిరి కాలనీలోని ఓ షెడ్‌లోనూ మంటలు చెలరేగాయి. రెండు చోట్ల మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.