సమస్యల పరిష్కారానికి పురమిత్ర యాప్
AKP: సమస్యల పరిష్కారానికి పురమిత్ర యాప్ దోహదపడుతుందని ఎలమంచిలి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు తెలిపారు. ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా 376 సమస్యలను పుర ప్రజలు అప్లోడ్ చేసినట్లు పేర్కొన్నారు. వీటిలో 283 సమస్యలను పరిష్కరించామన్నారు. 6,000 మంది దీనిని డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపారు.