అక్రమ కట్టడాలు కూల్చివేత

కాకినాడ: సంత చెరువు దుర్గమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో డ్రెయిన్‌పై అక్రమంగా నిర్మించిన కొన్ని దుకాణాలను నగర కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ పర్యవేక్షణలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది సోమవారం తొలగించారు. భారీ క్రేన్ సహాయంతో వీటిని కూల్చివేశారు. అక్రమ కట్టడాలు అయినందున నిబంధనల ప్రకారం కూల్చివేత కార్యక్రమం జరుగుతుందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.