విశాఖలో ప్రో కబడ్డీ సందడి

VSP: ఏడేళ్ల తర్వాత మళ్లీ విశాఖలో ప్రో కబడ్డీ లీగ్ (PKL-12) జరుగుతోంది. ఈనెల 29న రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు తమిళ్ తలైవాస్‌తో తలపడనుంది. ఈ సీజన్‌కు విశాఖతో పాటు జైపూర్, చెన్నై, ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ విశాఖలో లీగ్ జరుగుతుండడంతో కబడ్డీ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.