10 ఏళ్ల తర్వాత కోటిలింగాల పేటకు విముక్తి: ఎమ్మెల్యే
EG: ఏళ్ల తరబడి పరిష్కారం లేని సమస్యకు కూటమి ప్రభుత్వం వచ్చాక శాశ్వత పరిష్కారం చూపించామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక 41వ డివిజన్ కోటిలింగాలపేట పంప్ హౌస్ వద్ద చేపట్టిన గుర్రపు డెక్క తొలగింపు, డీ సిల్టేషన్ పనులను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల తర్వాత కోటిలింగాలపేటకు విముక్తి లభించిందన్నారు.