అభ్యర్థులు వ్యయ ఖర్చులు నమోదు చేయాలి: కలెక్టర్
MBNR: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు రోజువారి ప్రచార వ్యయ ఖర్చులు నమోదు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ బాబు అన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు వచ్చిన 45 రోజుల్లో తమ ఖర్చు వివరాలను సమర్పించాలన్నారు.