భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభలు

KKD: ఏపీ బిల్డింగ్, అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) కాకినాడ జిల్లా రెండవ మహాసభలు సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీలలో జగ్గంపేటలో జరగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం కాకినాడలో జిల్లా కార్యవర్గ సమావేశం అనంతరం గోడ పత్రికను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నిట్ల శ్రీను, రొంగల ఈ శ్వరరావు ఈ వివరాలను వెల్లడించారు.