VIDEO: ఘనంగా ఈస్టర్ పండుగ వేడుకలు

VIDEO: ఘనంగా ఈస్టర్ పండుగ వేడుకలు

ELR: చింతలపూడి నియోజకవర్గ వ్యాప్తంగా ఇవాళ ఈస్టర్ పండుగను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. క్రీస్తు పునరుద్ధానాన్ని పురస్కరించుకుని వేకువజాము నుంచే సమాధుల వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గ్రామాలలో క్రీస్తు గీతాలు ఆలాపిస్తూ ఊరేగింపులు చేపట్టారు. లోక రక్షకుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన రోజంటూ భక్తులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.