డివైడర్‌పైకి దూసుకెళ్లిన కంటైనర్

డివైడర్‌పైకి దూసుకెళ్లిన కంటైనర్

RR: కర్మన్ ఘాట్ మెయిన్ రోడ్ శ్రీ హనుమాన్ నగర్ కాలనీ వద్ద ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో ఓ అశోక్ లేలాండ్ గూడ్స్ కంటైనర్ వాహనం రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. వాహనం ముందుభాగం పూర్తిగా డివైడర్‌పైకి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.