విడపనకల్ మండలంలో ఇరువర్గాల ఘర్షణ

ATP: విడపనకల్లు మండలం పాల్తూరులో సుంకులాపార్వతి రథోత్సవం అనంతరం బైలాట వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకే కుటుంబంపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.