VIDEO: మల్లన్న గుట్ట జాతరలో విశేష ఉత్సవాలు
SRD: నారాయణఖేడ్ మండలం సంజీవనరావుపేట మల్లన్నగుట్ట జాతరలో భాగంగా సోమవారం గుట్టపైన ఆలయం వద్ద యాదవులు విశేష ఉత్సవ కార్యక్రమాలను చేపట్టారు. యాదవ సాంప్రదాయ డోలు చప్పుళ్ల మధ్య 'అల్లో నేరెడల్లో' అంటూ సాంప్రదాయ పాటలు పాడుతూ సాంప్రదాయ పద్ధతిన బియ్యం దంచడం (సుంకీయటం) జరిగింది. ఈ కార్యక్రమంలో పోశెట్టి జ్యోతి భూపాల్, సాయి రెడ్డి, పోశయ్య ఉన్నారు.