VIDEO: ఈతకు వెళ్లి బీటెక్ విద్యార్థి మృతి
GNTR: తుళ్లూరు మండలం రాయపూడి వద్ద కృష్ణానదిలో ఈతకు దిగిన బీటెక్ విద్యార్థి గర్రె వెంకట ఈశ్వర్ సాత్విక్ (21) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. శుక్రవారం స్నేహితులతో కలిసి నదిలోకి దిగిన సాత్విక్ నీటిలో గల్లంతయ్యాడు. మత్స్యకారుల సాయంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.