క్షయ నిర్మూలనకు ఉచిత వైద్య శిబిరం

క్షయ నిర్మూలనకు ఉచిత వైద్య శిబిరం

KDP: కమలాపురం మండలం నల్లింగాయపల్లిలో శుక్రవారం భారతి సిమెంట్, పెయిడ్ సంస్థ ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై అవగాహన సదస్సు జరిగింది. డాక్టర్ శ్రీకాళహస్తీశ్వర రెడ్డి క్షయ పూర్తిగా నయమవుతుందని, బాధితులు ఉచిత మందులు వాడాలని సూచించారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి 88 మందికి రక్త, గళ్ళ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 196 మందిని పరీక్షించి మందులు పంపిణీ చేశారు.