సంతబయలులో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
ASR: డుంబ్రిగూడ మండలంలోని కించుమండ సంతబయలులో శ్రీరామ నవమి పండుగను శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ ఏర్పాటు చేసి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.