వేటపాలెంలో పెన్షన్‌లు అందించిన టీడీపీ నేత
BPT: వేటపాలెంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువత అధ్యక్షులు దొగిపర్తి బాలకృష్ణ పాల్గొని అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేరుగా ఇంటికే పెన్షన్ నగదు అందుతుందని చెప్పారు.