చిన్న అవుటపల్లి వంతెనపై వాహనాల పరుగులు
కృష్ణ: చిన్న అవుటపల్లి వద్ద జాతీయ రహదారి అనుసంధాన పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా గొల్లపూడి-ఏలూరు వైపు వెళ్లే వాహనాల కోసం చిన్న అవుటపల్లి పైవంతెనను అధికారులు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాల కోసం పనులు వేగంగా సాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే 2 వైపులా రాకపోకలకు అనుమతించనున్నారు.