తోట్లవల్లూరు రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కృష్ణా: తోట్లవల్లూరులో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బందర్ కాలువ సమీపంలో ఉన్న తిరుపతమ్మ తల్లి గుడి వద్ద ఫ్లైఓవర్ ఎక్కుతుండగా బొలెరో వాహనం, బైక్ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తోట్లవల్లూరుకి చెందిన ఎర్రగుంట ప్రసాద్ తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.