మాజీ సర్పంచ్ మృతి.. రైస్ మిల్లుపై దాడి యత్నం!
GDWL: కేటి దొడ్డి మండలం నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు హత్య కేసుతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ హత్యలో రైస్ మిల్లు యజమాని కీలక పాత్ర పోషించారని అనుమానం వ్యక్తం చేస్తూ శనివారం మృతుడి కుటుంబ సభ్యులు రైస్ మిల్లుపై దాడికి యత్నించడంతో గ్రామం ఒక్కసారిగా రణరంగంగా మారింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.