టిడిపి నాయకుల భారీ బైక్ ర్యాలీ

టిడిపి నాయకుల భారీ బైక్ ర్యాలీ

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అనంతపురంలో టిడిపి నాయకులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీని నిర్వహించారు. అర్బన్ పార్టీ కార్యాలయం నుంచి రాంనగర్ సప్తగిరి సర్కిల్, టవర్ క్లాక్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఈ బైక్ ర్యాలీ సాగింది.