రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయము
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11 కేవి జంగేడు ఫీడ్‌పై చెట్ల కొమ్మలు తీయుటతో పాటు లైన్ మరమ్మత్తులు శుక్రవారం చేయనున్నట్లు ఏఈ విశ్వాస్ రెడ్డి తెలిపారు. మరమ్మత్తుల కారణంగా పెద్దకుంటపల్లి, పుల్లూరి రామయ్యపల్లి, గండ్రపల్లి, మహబూబ్ పల్లి, పిల్లోనిపల్లి గ్రామాలలో ఉదయం 8.30 ని"ల నుంచి మధ్యాహ్నం 12 గం"ల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయము ఉంటుందన్నారు.