వక్ఫ్ బిల్లుపై ఆందోళన వద్దు: ఎమ్మెల్యే

ATP: వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. సీఎం చంద్రబాబు ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది రానివ్వరని అన్నారు. అశోక్ నగర్‌లో ముస్లింల స్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షకీల్ షఫీ, మేయర్ వసీం, కమిషనర్ బాలస్వామి పాల్గొన్నారు.