జిల్లాకు 2640 మెట్రిక్ టన్నుల యూరియా

కృష్ణా: యూరియా సరఫరా కోసం రైతులు అనవసర ఆందోళన చెందవద్దని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు గురువారం తెలిపారు. కృష్ణా జిల్లాలో యూరియా సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా జరుగుతోందని అన్నారు. ఇప్పటివరకు 5,881 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయగా, ఈరోజు 2640 మెట్రిక్ టన్నులు జిల్లాకు వచ్చిందని పేర్కొన్నారు.