రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
HNK: కాజీపేట మండలంలోని అయోధ్యపురం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం పరిశీలించారు. పనుల పురోగతి, నిర్మాణ నాణ్యతపై అధికారులను ప్రశ్నిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు.