ప్రయాణికులకు శుభవార్త

ప్రయాణికులకు శుభవార్త

W.G: బత్తిలి, పలాస, విశాఖపట్నం లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు భీమవరం పాత బస్టాండ్ నుంచి బయలు దేరుతున్నట్లు భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్ పీఎన్ విఎం సత్యనారాయణ మూర్తి శుక్రవారం తెలిపారు. భీమవరం నుంచి పాలకొల్లు, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, పాలకొండ, బత్తిలి రూట్లో వెళ్లే సర్వీసులను పాత బస్టాండ్ మీదుగా మళ్లించామని ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.