'గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి'
KMR: నూతనంగా గెలుపొందిన సర్పంచులు గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. కామారెడ్డిలో గెలుపొందిన సర్పంచులతో పాటు వార్డు సభ్యులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుందని గుర్తు చేశారు.